‘దళిత బంధు’ BRS ఎమ్మెల్యేల ‘దళారీ బంధు’.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-22 10:30:34.0  )
‘దళిత బంధు’ BRS ఎమ్మెల్యేల ‘దళారీ బంధు’.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దళిత బంధు పథకానికి నిధుల కొరత ఉందని, మరోవైపు ఎన్నికల నేపథ్యంలో ఈ పథకం ద్వారా వీలైనంత మంది ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక కొత్త పథకానికి తెరతీశారని టాక్ నడుస్తోంది. ఈ పథకం కింద ఒక్కో దరఖాస్తుదారులకు మంజూరమ్యే ఒక్కో యూనిట్‌లో ముగ్గురు నుంచి ఐదు మంది దాకా పంచుకునేలా రూపోందించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కమార్ ఇవాళ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘దళిత బంధు' బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు 'దళారీ బంధు'గా మారిందనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాల్నా? అని నిలదీశారు.

చట్టబద్దంగా ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన సబ్‌ ప్లాన్‌ నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్ళించి తన స్వార్థం కోసం, పార్టీ కోసం 'దళిత బంధు' ప్రవేశపెట్టారన్నారు. బీసీల ఓట్ల కోసం 'బీసీ బంధు' ప్రవేశపెట్టారన్నారు. వేల కోట్ల ప్రజాధనంతో 'బంధు' పథకాలు ప్రవేశపెట్టింది పేదల అభివృద్ధి కోసమా? లేక బీఆర్ఎస్ పార్టీలో జెండాలు మోసి, దందాలు చేసే కార్యకర్తల కోసమా? అని ప్రశ్నించారు. దళితులు, బీసీల 'ఓట్ల' కోసం ఎన్నికల ముందు కేసీఆర్ ప్రవేశపెట్టే ఎన్ని 'బంధు' పథకాలైనా, పేదోళ్ల బతుకులు మార్చవని, బహుజనులకు రాజ్యాధికారం దక్కితే తప్ప సాధ్యం కాదని పేర్కొన్నారు.

Advertisement

Next Story