KTR: క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్.. కేటీఆర్‌కు ఫిదా అయిన చిన్నారి!!

by Anjali |   ( Updated:2024-09-01 03:09:13.0  )
KTR: క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్.. కేటీఆర్‌కు ఫిదా అయిన చిన్నారి!!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గొప్పతనం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆపదలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఎవరేం ట్వీట్లు పెట్టిన వెంటనే స్పందించి.. ఆర్థిక సాయం చేస్తుంటారు. 2004 లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మొట్ట మొదటిసారిగా పోటీచేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. మళ్లీ 2010 లో జరిగిన ఉప ఎన్నికల్లో కేకే మహేందర్ రెడ్డిపై 68, 219 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఎన్నో సేవలందించారు. కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నిక్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం చవిచూసింది. అయినప్పటికీ కేటీఆర్ ప్రజల తరపున, అభ్యర్థులు, విద్యార్థులు, రైతుల బాగోగుల గురించి తెలుసుకుంటూ న్యాయం చేసే దిశలో నడుస్తున్నారు. ఇకపోతే కేటీఆర్ ఓ క్యూట్ పాపను ఎత్తుకుని ఉన్న క్యూట్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బేబీ పింక్ డ్రెస్ ధరించిన చిన్నారి కేటీఆర్‌ను చూపుతిప్పకుండా అలాగే చూస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవ్వగా.. ‘క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్, సో క్యూట్, కేటీఆర్‌కు బేబీ కూడా ఫిదా అయిపోయింది’ అంటూ లవ్ సింబల్స్ జోడించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed