- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Ponguleti : పత్తి మద్ధతు ధరలో కోత విధిస్తే సహించం : మంత్రి పొంగులేటి
దిశ, వెబ్ డెస్క్ : పత్తి మద్ధతు ధర(Cotton support price)లో తేమ సాకుతో, తరుగు పేరుతో కోత విధిస్తే సహించేది లేదని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) హెచ్చరించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పర్యటనలో శ్రీనివాసరెడ్డి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈసంవత్సరం అధిక వర్షాలతో పత్తి పంట నష్ట పోయారని, రెండు లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నామని, జిల్లాలో తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మద్దతు ధర ఇవ్వడం తో పాటు 12 శాతం ఉండే విధంగా చూసుకోవాలని, వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామమని స్పష్టం చేశారు.
Telugu News , Latest Telugu news , Latest News in Teluguమాది రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతుకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దని విప్లవాత్మక మార్పులు చేస్తున్నామని, ఇప్పటికే 18వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. రుణమాఫీ పై ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నాయని, అర్హులైన రైతులందరికీ తల తాకట్టు పెట్టైన రుణమాఫీ చేస్తామని, డిసెంబర్ లోపే 31 వేల కోట్ల రుణమాఫీ అమలు చేస్తామన్నారు. అర్హులైన పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు దీపావళి కానుకగా ఇవ్వబోతున్నామని, ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఇల్లు కట్టిచారో ఇప్పుడు కూడా అలాగే ఇస్తామని వెల్లడించారు. వరికి సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పామని అలాగే ఇవ్వబోతున్నమని గుర్తు చేశారు.