ఆగస్టు 20న సీ టెట్ రాత పరీక్ష..

by Vinod kumar |
ఆగస్టు 20న సీ టెట్ రాత పరీక్ష..
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై-2023 అడ్మిట్‌ కార్డులు ఆగస్టు 18న విడుదల కానున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఓ ప్రకటనలో వెల్లడించింది. సీటెట్ జులై 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సంబంధిత వివరాలు నమోదు చేసుకుని అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆగస్టు 20వ తేదీన ఆఫ్‌లైన్‌ విధానంలో రెండు సెషన్లలో సీటెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed