- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గోల్కొండ కోటలో పంద్రాగస్టుకు ఏర్పాట్లు షురూ.. ఫస్ట్ టైమ్ సీఎం హోదాలో రేవంత్
దిశ, తెలంగాణ బ్యూరో: పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రతీసారి జరిగినట్లే ఈసారి కూడా ఈ వేడుకలకు గోల్కొండ కోట వేదిక అవుతున్నది. తొలుత వేదికను మార్చాలని అధికారుల నుంచి ప్రతిపాదనలు వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని స్పష్టం చేశారు. సీఎం హోదాలో ఫస్ట్ టైమ్ రేవంత్ ఆ వేదిక మీద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించిన చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి వివిధ విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేసి వర్క్ డివిజన్ చేశారు. వేడుకలు సంతృప్తికరంగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేడుకల నిర్వహణకు రూపొందించిన షెడ్యూలు, చేసిన ప్లానింగ్ తదితరాలను స్వయంగా అమె దగ్గరుండి సోమవారం సమీక్షించారు.
ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ సాంస్కృతిక వారసత్వం ప్రతిభింబించేలా సాంప్రదాయ దుస్తుల్లో కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. గుస్సాడి, కొమ్ముకోయ, లంబాడీ, డప్పులు, ఒగ్గుడోలు, కోలాటం, బోనాలు, భైండ్ల జమిడికల్, చిందు యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి నృత్యం వంటి వివిధ కళారూపాలకు చెందిన వెయ్యి మందికి పైగా కళాకారులు ప్రదర్శనలు ఇస్తారని తెలిపారు. పిల్లల్లో దేశభక్తి స్ఫూర్తిని కలిగించేందుకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని నొక్కిచెప్పారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పెద్ద సంఖ్యలో వీఐపీలు, ప్రజలు, విద్యార్థులు హాజరవుతున్నందున వాతావరణ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ నొక్కిచెప్పారు. వర్షం వస్తే ఇబ్బందులు లేకుండా వాటర్-ప్రూఫ్ టెంట్లను రెడీ చేయాలని నొక్కిచెప్పారు. వీఐపీలు హాజరయ్యే ప్రతీ సందర్భంలో ట్రాఫిక్ సమస్యలు, ప్రజలకు అసౌకర్యం కలిగే ఘటనలు, పోలీసుల బందోబస్తుతో కొన్నిసార్లు ఘర్షణలు నెలకొనడం... వీటి విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టిన చీఫ్ సెక్రెటరీ రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. డీజీపీ జితేందర్, జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్‌రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు మరికొందరు అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు.
ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రి హోదాలో గోల్కొండ కోట మీద నుంచి రేవంత్ రెడ్డి చేయనున్న తన ప్రసంగంలో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారనే ఆసక్తి నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేయడం, రుణమాఫీని నెల రోజుల వ్యవధిలోనే సంపూర్ణంగా అమలు చేయడం, రాష్ట్ర ఖ్యాతిని పెంపొందించేలా ప్రణాళికలను రూపొందించడం, విదేశాల్లో తెలంగాణను ‘ఫ్యూచర్ స్టేట్’గా పరిచయం చేసి పెట్టుబడులను గణనీయంగా తీసుకురావడం, గతంలో ఎన్నడూ లేనంతగా వ్యవసాయ రంగానికి రూ. 72 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేయడం... వీటన్నింటినీ తన ప్రసంగంలో సీఎం రేవంత్ పేర్కొనే అవకాశమున్నది.