CS Shanthi Kumari: రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో బస చేయాలి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశం

by Shiva |
CS Shanthi Kumari: రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో బస చేయాలి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో తనిఖీలు చేపట్టాలని కలెక్టర్లను చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆమె ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్లు తమకు సంబంధిత జిల్లా పరిధిలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో తనిఖీ చేపట్టాలన్నారు. నెలలో ఒకరోజు రాత్రి బస చేయాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో నాణ్యత పెంపొందేందుకు దోహద పడుతోందని స్పష్టం చేశారు. కలెక్టర్లు తమ రాత్రి బసకు సంబంధించిన తేదీలతో పాటు గమనించిన ఇబ్బందులు, ఇతర అంశాలను తమ డైరీలో రాసుకోవాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed