- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జున సాగర్ డ్యామ్‌పైకి భారీగా చేరుకుంటున్న CRPF బలగాలు
దిశ, నాగార్జునసాగర్ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై నెలకొన్న వివాదం కొలిక్కి రానుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతిలో పెట్టాలన్న ప్రతిపాదనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంగీకరించాయి. దీంతో ప్రాజెక్టు వద్దకు సీఆర్‌పీఎఫ్ బలగాలు భారీగా చేరుకుంటున్నాయి. తెల్లవారుజామునుంచి ఒక్కో పాయింట్‌ను తమ అధీనంలోకి తీసుకుంటున్నాయి. 13వ గేటు వద్ద ఏపీ పోలీసులు వేసిన ముళ్ల కంచెను తొలగించి మధ్యాహ్నానికి ప్రాజెక్టు మొత్తాన్ని స్వాధీనం చేసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు, సాగర్ కుడి కాలువ ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.
నాగార్జునసాగర్ డ్యామ్‌పైకి సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకుంటున్నాయి. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఒక్కో పాయింట్‌ను స్వాధీనంలోకి తీసుకుంటున్నాయి. మధ్యాహ్నం కల్లా సాగర్ ప్రాజెక్టును పూర్తిగా.. కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకోనుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంగీకారం తెలిపాయి. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ డ్యామ్ పైకి చేరుకుంటున్నాయి. ఇవాళ ఉదయం 5:00 గంటల నుంచి ఒక్కో పాయింట్‌ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. దీంతో మధ్యాహ్నం కల్లా డ్యామ్ పూర్తిగా కేంద్రం వారి అధీనంలోకి వెళ్లనుంది.
ఆ తర్వాత 13వ గేట్ వద్ద కంచెను తొలగించే అవకాశం ఉంది. సీఆర్ఫీఎఫ్ బలగాల రాకతో.. తెలంగాణ పోలీసులు డ్యామ్ వద్ద నుంచి వెనుదిరిగారు. మరోవైపు సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. కుడి కాలువ ద్వారా ప్రస్తుతం 5,450 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. నాగార్జునసాగర్ నుంచి ఏపీ నీటి విడుదల, ఆ రాష్ట్ర పోలీసు బలగాల మోహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, నీటిపారుదల శాఖ అధికారులతో ఆన్‌లైన్ ద్వారా అత్యవసర సమీక్ష జరిపారు. గత నెల 29న ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి.. నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో తలెత్తిన వివాదంపై భల్లా సమీక్ష నిర్వహించారు.
గత నెల 28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని అజయ్‌కుమార్ భల్లా.. ఆంధ్రప్రదేశ్‌ను కోరారు. ప్రాజెక్టు నిర్వహణ తాత్కాలికంగా సీఆర్పీఎఫ్ పర్యవేక్షణలో ఉంటుందని సూచించారు. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని అజయ్‌కుమార్ భల్లా వివరించారు. ఈ ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు సీఆర్‌పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి.
నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంలో యథాతథ స్థితి కొనసాగింపునకు ఇరు రాష్ట్రాల అంగీకారం' కృష్ణా జలాల వివాదంపై నేడు సమావేశం :కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాద పరిష్కారానికి.. కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖకార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌లు, సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు ఛైర్మన్లకు లేఖ పంపింది. శ్రీశైలం డ్యాం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలు, వాటి పరిధిలో ఉన్న ఇతర నిర్మాణాలన్నింటినీ కృష్ణా బోర్డుకు బదిలీ చేసే అంశాలపైనా ప్రధానంగా చర్చించనున్నట్లు వివరించింది
డ్యాం నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుందని, సీఆర్ పీఎఫ్ బలగాలతో పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని అజయ్ కుమార్ భల్లా చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు.