- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడ్డగోలుగా ఇటుక బట్టీలు.. రూల్స్.. గీల్స్ జాన్తానై
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో అనుమతులు లేకుండానే ఇటుక బట్టీలను అడ్డగోలుగా నిర్వహిస్తున్నారు. మండలంలోని గంధంపల్లి, కొత్తపేట, నామాలపాడు పంచాయతీల పరిధిలో సుమారుగా 38 ఇటుక బట్టీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అనుమతులు లేకుండానే ఇటుకల విక్రయానికి పాల్పడుతున్నారు. కాగా, వాటిలో సగానికి పైగా అనుమతులు లేనట్లు తెలుస్తోంది.
మిగతా బట్టీలు ఎటువంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాదికి మండలంలో ఇటుక బట్టీలకు కొత్త అనుమతులు పొందలేదని అధికారుల తెలుపుతున్నారు. అంతేకాక భారీ చెట్లను నరికి బట్టీలు కాల్చడానికి కలపను తరలిస్తున్నారు. దీంతో వచ్చే పొగ, దుమ్ము, ధూళితో స్థానిక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- దిశ, బయ్యారం
దిశ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో అనుమతులు లేకుండానే ఇటుక బట్టీలను అడ్డగోలుగా నిర్వహిస్తున్నారు. మండలంలోని గంధంపల్లి, కొత్తపేట, నామాలపాడు పంచాయతీల పరిధిలో సుమారుగా 38 ఇటుక బట్టీలు ఏర్పాటు చేసుకుని ఇటుకలను తయారు చేసి విక్రయాలకు పాల్పడుతున్నారు. వీరిలో అనుమతి కలిగిన ఇటుక బట్టీలు సుమారుగా 16వరకు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
16 ఇటుక బట్టీల వారికి 2022 డిసెంబర్ వరకు మాత్రమే అన్ని అనుమతులు ఉన్నట్లు సమాచారం. మిగతా బట్టీలు ఎటువంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాదికి మండలంలో ఇటుక బట్టీలకు కొత్త అనుమతులు పొందలేదని తెలిసింది.
అనుమతులు తప్పనిసరి..
వ్యవసాయ భూమి పట్టాదారు నాలా కన్వర్షన్ చేసుకోవాలి. పంచాయతీ కార్యాలయ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న పరిశ్రమల శాఖ, బట్టీల్లో పనుల కోసం కార్మికుల (లేబర్) లేబర్ ఆఫీసులో అనుమతులు పొందాల్సి ఉంటుంది. రెవెన్యూ, ఫైర్, విద్యుత్, వ్యవసాయ, జీఎస్‌టీ, సేల్ టాక్స్, ఇన్ కంటాక్స్, మైనింగ్ శాఖల నుంచి మట్టి కోసం అనుమతులు తీసుకోవాలి.
తయారు చేసిన మట్టి ఇటుకలను కాల్చేందుకు బొగ్గు, ఊక, సుబాబుల్ కలప, ఇతర శాఖల అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్మికులకు నివాసానికి, అందుకు కావల్సిన వసతులు ఉండే విధంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
అనుమతి లేకుండానే కలప తరలింపు..
మండలంలో ఇటుక బట్టీల యజమానులు తమ పలుకుబడితో వేప, చింత, సించింత, తుమ్మ కలపను అక్రమ మార్గంలో ఇటుకలను కాల్చేందుకు ఇటుక బట్టీల్లలో వాడుతున్నారు. దీనిపై బయ్యారం ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సువర్చలను వివరణ కోరగా ఇటుక బట్టీల్లో వేప, తుమ్మ ఇతర పచ్చి కలప వాడినట్లు తమ దృష్టికి రాలేదని, ఎవరైనా బట్టీల వారు, ట్రాక్టర్ యజమానులు అక్రమంగా కలప తరలిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నోటీసులు జారీ చేశాం..
దీనిపై మండల తహశీల్దార్ అనంతుల రమేష్‌ను వివరణ కోరగా ఇటుక బట్టీల ఏర్పాటుకు అనుమతులు తీసుకున్న వివరాలను అందించాలని 15రోజుల కింద నోటీసులు జారీ చేశామని తెలిపారు. వారిలో కొంతమంది 16ఇటుక బట్టీల యజమానులు వారి అనుమతులను చూపగా అవి 2022 డిసెంబర్ వరకు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కాగా, వాటి అనుమతుల కోసం రెన్యువల్ చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు.
అనుమతిలేని వ్యవసాయ భూముల నాలా కన్వర్షన్ చేయకుండా వ్యవసాయ భూమిని రైతుబంధు పొందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అటువంటి వాటిలో ఇటుక బట్టీలు పెట్టి నడపడం చట్ట విరుద్దమని అన్నారు. దీనిపై భూమి సాగు వివరాల కోసం మండల వ్యవసాయ అధికారి అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఇటుక బట్టీలపై వారం రోజుల్లో చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.