- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేసీఆర్ సీఎంగా ఉండి ఉంటే ఒక్క ఎకరం కూడా ఎండిపోకపోతుండే’
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కక్ష పూరిత వైఖరి వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్ట పోయిందన్నారు. నీళ్ళను ఎలా ఇవ్వాలో తెలియక ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. కేసీఆర్‌ను నమ్ముకొని పంటలు పెట్టాము, నీళ్ళు ఉండి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం లేదని రైతులు బాధపడుతున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ హయంలో చెక్ డ్యామ్‌లు నిర్మించి కాళేశ్వరం నీళ్ళను అందించామని తెలిపారు.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాధాన్యతను గుర్తించి కేంద్రంతో మాట్లాడి, మహారాష్ట్రను ఒప్పించి నిర్మించారన్నారు. కేసీఆర్ ఇప్పుడు ఉండి ఉంటే ఒక్క ఎకరం కూడా ఎండనిచ్చే వాడు కాదని వెల్లడించారు. కేసీఆర్ కరీంనగర్ వస్తున్నాడని తెలిసి గాయత్రి పంప్ ద్వారా నీళ్ళను లిఫ్ట్ చేసి కాలువలకు వదిలారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు ఉన్నారని సోయి కూడా లేదు, ఆయన మూటలతో ఢిల్లీకి పోవడమే సరిపోతోంది కానీ, రైతులను ఆనంద పరిచింది లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, పంటనష్టపోయిన రైతులకు సాయం చేయాలని డిమాండ్ చేశారు.