- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ అడుగుజాడల్లో సీఎం రేవంత్.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మాజీ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్టు అనిపిస్తోందని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. ఇవాళ బీజేపీ స్టే ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ పాలన సాగుతోందని విమర్శించారు. పేదలను గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఇటీవల ఏబీవీపీ విద్యార్థిని పట్ల పోలీసులు అనుసరించిన తీరు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లను గెలిపించాలని, కార్యకర్తలంతా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
అవినీతి లేని పాలన ప్రధాని మోడీ అందిస్తున్నారని చెప్పారు. మోడీ పాలనలో దళారుల బెడద లేదన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లౌకికవాదంగా కాంగ్రెస్ భావిస్తుందని అన్నారు. సోమనాథ ఆలయం నిర్మాణం చేపడితే ఆనాడు నెహ్రూ తిరస్కరించారని, నేడు అయోధ్యలో రామాలయం ప్రారంభాన్ని రాహుల్ గాంధీ తిరస్కరించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలే తిరస్కరిస్తారని, నాడు అంబేద్కర్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా.. మదర్ ఆఫ్ డెమోక్రసీగా భారత దేశం పేరు సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు మోడీ కృషి చేస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ జన్మస్థలం మహూ నుంచి మొదలుకొని ఆయన పెరిగిన ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దారని అన్నారు. రాజ్యాంగ బద్దంగా మోడీ పాలన సాగిస్తున్నారని అన్నారు.