- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీసీ బుక్ అయిపోయింది.. నెల రోజుల తర్వాత రా టీసీ ఇస్తాం: ఇదీ రాష్ట్ర విద్యాశాఖ దుస్థితి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పేద పీట వేస్తోందని ఎమ్మెల్యేలు, మంత్రులు పదే పదే చెబుతున్నా వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఓ విద్యార్ధి ఇటీవలే హైదేరాబాద్ బహదూర్ పుర కేజీబీవీలో 8 వ తరగతి వరకు చదువుకొని 9వ తరగతికి మరో పాఠశాల్లో చేరేందుకు టీసీకి అప్లై చేసుకుంది. అయితే పాఠశాల ప్రిన్సిపాల్ తమ పాఠశాలలో టీసీ బుక్ అయిపోయిందని ఉన్నతాధికారులకు చెప్పామని, అక్కడ నుండి టీసీ బుక్ లు రావడానికి నెల సమయం పడుతుందని చెప్పడంతో ఆ విద్యార్థిని ఏమి పాలుపోలేని స్థితిలో ఉండిపోయింది.
ఆ విద్యార్థినికి 9వ తరగతి మరో పాఠశాల్లో చేరేందుకు ఆ పాఠశాల యాజమాన్యం టీసీ కావాలని కోరడంతో ఆ విద్యార్థిని తిరిగి కేజీబీవీ ప్రిన్సిపాల్ ను మరో సారి వేడుకొంది. దీంతో ప్రిన్సిపాల్.. సదరు పాఠశాలకు ఒక లేఖను పంపారు. తమ పాఠశాలలో టీసీ బుక్ వచ్చినంత వరకు అడ్మిషన్ కు అనుమతించండి అంటూ సిఫారసు లేఖ రాయడం గమనార్హం. రాష్టంలో విద్యావవస్థ దుస్థితికి ఈ ఘటన అద్దంపడుతుందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.