క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. నలుగురి వద్ద రూ.46 లక్షలు స్వాధీనం

by GSrikanth |
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. నలుగురి వద్ద రూ.46 లక్షలు స్వాధీనం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సైబరాబాద్ పోలీసులు మరో రెండు క్రికెట్ బెట్టింగ్ గ్యాంగులను పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 46 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై మైలార్ దేవులపల్లి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఏ క్రమంలో దాడులు చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి 46 లక్షలు సీజ్ చేశారు. మరికొందరు నిందితులు పరారయ్యారు. వీరి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ చెప్పారు.

Advertisement

Next Story