కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ.. స్వయంగా జోక్యం చేసుకోవాలని వినతి

by GSrikanth |
కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ.. స్వయంగా జోక్యం చేసుకోవాలని వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వీఆర్‌ఏల సమస్యలను వెంటనే ప్రభుత్వానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తమ సమస్యల పరిష్కారం కోసం 23 వేల మంది వీఆర్‌ఏలు గత 45 రోజులుగా సమ్మె చేస్తున్నారనన్నారు. తమ సమస్యలపై అనేకసార్లు దరఖాస్తులు ఇచ్చినా, ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదన్నారు. దీంతో జూలై 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రారంభించారని ఆయన పేర్కొ్నారు. సమ్మె చేస్తున్నా ప్రభుత్వ నుంచి స్పందన లేదంటూ కామారెడ్డి జిల్లా బొల్లారంలో చెట్టుకు ఉరేసుకొని వీఆర్‌ఏ ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. గత మూడు నెలలుగా జీతాలు అందక పోవడం, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది ఏఆర్‌ఏలు చనిపోతున్నారని తెలిపారు. వరంగల్‌, హన్మకొండ, ఖమ్మం, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, నాగర్‌కర్నూలు తదితర జిల్లాల్లో గత 45 రోజుల్లో 23 మంది ప్రాణాలొదిలారని, కొద్దిమంది దీక్షా శిబిరాల్లోనే గుండెపోటుతో తనువు చాలిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రత దృష్ట్యా సీఎం స్వయంగా జోక్యం చేసుకొని పరిష్కరించాల్సిందిగా ఆ లేఖలో తమ్మినేని కోరారు.

Advertisement

Next Story

Most Viewed