- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రామోజీరావు మృతి పట్ల CPI తెలంగాణ సంతాపం
దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మరణం పట్ల సీపీఐ రాష్ట్ర సమితి పార్టీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేరిట ఒక ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ స్థాయిలో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి, ఎన్నో గొప్ప చిత్రాలకు రామోజీ రావు జీవం పోశారని అన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన మహానీయుడని గుర్తుచేశారు. అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన అందరికీ మార్గదర్శకమని చెప్పారు. తన జర్నలిజం స్కూల్ ద్వారా ఎంతోమందిని జర్నలిస్టులను తయారు చేశారని అన్నారు. రామోజీ మరణం సినిమా పరిశ్రమకు, పత్రికా రంగానికి తీరని లోటని అన్నారు. రామోజీ రావు ఒక విశిష్టమైన వ్యక్తి, పట్టుదలకు మారుపేరు కలిగిన రామోజీరావు మృతిపట్ల సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి సంతాపాన్ని తెలియజేశారు. చిట్‌ఫండ్ కంపెనీ ద్వారా అంచలంచెలుగా ఎదిగారని గుర్తుచేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణమే ఆయన పట్టుదలకు అద్దం పడుతుందని అన్నారు.