సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ లేఖ

by GSrikanth |
సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: వీఆర్ఏలకు పేస్కేల్‌ను వర్తింపజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 'వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తాను, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పేస్కేల్ వర్తింపజేస్తాము, వయస్సు పైబడిన వారి కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తాము' అని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పేర్కొన్నారు. వీఆర్ఏలు రెవెన్యూ శాఖలోని పనులకు సహాయ పడుతూనే సంక్షేమ పథకాల సమగ్ర సర్వే, దళిత బంధు, ఇతర సంక్షేమ పథకాలకు సహాయ పడుతున్నారని వివరించారు. అనేక సంవత్సరాలగా వీఆర్ఏ‌లు చాలీచాలని వేతనాలతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని తెలిపారు. వీఆర్ఏలను ఉపయోగించుకొని రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని, ధరణిలో చోటుచేసుకొన్న తప్పులను సరిచేయడానికి క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఏల అవసరం ఉందని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed