ప్రజాస్వామ్య స్ఫూర్తిని బీజేపీ ధ్వంసం చేస్తోంది.. సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా

by Javid Pasha |   ( Updated:2023-08-12 14:23:30.0  )
ప్రజాస్వామ్య స్ఫూర్తిని బీజేపీ ధ్వంసం చేస్తోంది.. సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా
X

దిశ , తెలంగాణ బ్యూరో : భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక స్ఫూర్తిని బీజేపీ ధ్వంసం చేస్తుందని, ప్రగతిశీల శక్తులే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా పిలుపునిచ్చారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అయన మాట్లాడుతూ.. యావత్ దేశానికే అత్యంత ప్రమాదకరమైన ప్రజాస్వామ్య నైతికతకు మోడీ ప్రభుత్వం కోలుకోలేని నష్టం కలిగించిందని తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి భారత రాజ్యాంగ సృష్టికర్తలను అగౌరవపరుస్తూ ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడం ద్వారా బీజేపీ ప్రతి భారతీయుని మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేసారు. బీజేపీ దుర్మార్గపు చర్యలను చూసి దేశ ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరని అయన పేర్కొన్నారు.

రాజకీయ అధికారం కోసం బీజేపీ ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజించడం చేస్తుందని, దీనితో దేశంలో అసహనం, అశాంతి నెలకొన్నదని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ ధోరణిలతో "ప్రతీకార రాజకీయాలను" అవలంభిస్తూ అణిచివేత, మూక దాడులను, హింసను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. బీజేపీ "ఫాసిస్ట్" పాలనను అంతం చేయడానికి, భారత రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకిక విలువలను కాపాడేందుకు రాజ్యాంగ అనుకూల, లౌకిక మరియు ప్రజాస్వామ్య భారతదేశాన్ని విశ్వసించే 'ప్రగతిశీల, లౌకిక, ప్రజాతంత్ర' శక్తులందరు ఏకమై "భారతదేశ ఆత్మను" రక్షించుకోవాలని సయ్యిద్ అజీజ్ పాషా పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed