- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పేపర్ వర్క్ తప్పితే.. ప్రాక్టికల్‌గా చేయలేదు.. బీఆర్ఎస్‌పై కూనంనేని సెటైర్లు
by srinivas |

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు చాలా చేశామని అనుకుంటున్నారని, కానీ పేపర్ వర్క్ తప్పితే..ప్రాక్టికల్‌గా చేయ లేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. ముగ్దుమ్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొందపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టు ఉందని బీఆర్ఎస్‌పై సెటైర్ వేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాలేదని, జరిగిన మార్పుని బీఆర్ఎస్ నేతలు అంగీకరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేక పోతుందని కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
Next Story