- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టూరిజం కాంట్రాక్టు ఉద్యోగుల వయోపరిమితి పెంచాలి.. సీఎం కేసీఆర్‌కు చాడ వెంకటరెడ్డి లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ టూరిజం కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ టూరిజం కార్పోరేషన్‌లో గత 25 ఏళ్లకు పైబడి చాలీచాలని వేతనాలతో కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. వీరి సర్వీసులు ఎలాంటి క్రమబద్దీకరణకు నోచుకోకుండానే 25 సంవత్సరాలు గడిచిపోయాయని పేర్కొన్నారు.
దీంతో చాలా మంది కాంట్రాక్టు ఉద్యోగులు రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నారని, దీంతో వారి కుటుంబాలు గడవడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. కావున తెలంగాణ టూరిజం కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వయో పరిమితిని రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా 61 సంవత్సరాలకు పెంచాలని లేఖలో కోరారు.