- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రీతి అలా చేయొద్దని వేడుకుంది: కీలక వివరాలు వెల్లడించిన CP రంగనాథ్
దిశ, వెబ్‌డెస్క్: కాకతీయ మెడికల్ స్టూడెంట్ మెడికో ప్రీతి ఆత్మహత్యయత్నం ఘటనకు సంబంధించిన కేసు వివరాలను వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. శుక్రవారం సీపీ మీడియాతో మాట్లాడారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామని తెలిపారు. నిందితుడు సైఫ్‌ను కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. సైఫ్ బాధితురాలు ప్రీతిని వేధించినట్లుగా ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు. వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టి ప్రీతిని అవమానించారని పేర్కొన్నారు. గ్రూప్‌లో మెసేజ్ పెట్టొదని ప్రీతి వేడుకుందని.. కానీ సైఫ్ ప్రీతిని టార్గెట్ చేసి వేధించాడని తెలిపారు.
వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టి వేధించడం కూడా ర్యాంగింగ్ కిందకే వస్తుందని సీపీ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థులు సమ్మెకు సిద్ధమయ్యారు. తక్షణమే సమ్మె నోటీసు ఇస్తామని సీనియర్ విద్యార్థులు ప్రకటించారు. సీనియర్లపై కేసులు పెట్టడంపై పీజీ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే, విద్యార్థుల సమ్మె ప్రకటనపై సూపరిటెండెంట్ స్పందించారు. 48 గంటల మందు సమ్మె నోటీసు ఇవ్వాలని తెలిపారు.