- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cowsheds:గోశాలలను, గోవులను పరిరక్షించడం మన బాధ్యత.. ప్రముఖ ప్రవచన కర్త బంగారయ్య
దిశ, తెలంగాణ బ్యూరో: గోశాలల(Cowsheds)ను భారీగా ఏర్పాటు చేస్తూ గోవులను పరిరక్షించడం(Protect The Cows) మనందరి బాధ్యత(Responsibility) కావాలని ప్రముఖ ప్రవచన కర్త బంగారయ్య(Popular Prophet Bangaraiah) పిలుపునిచ్చారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక(Brahmin Welfare Vedika) ఆధ్వర్యంలో ఆదివారం ఎల్బీనగర్(LB Nagar) లోని సువర్ణ గోశాల(Suvarna Goshala)లో చతుర్థవార్షికోత్సవం సందర్భంగా గోశాల నిర్వాహకులకు సత్కార కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రవచనకర్త, తత్వం ఛారిటబుల్ ట్రస్ట్(Tatvam Charitable Trust) అధినేత బంగారయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేక రంగాల్లో ఉన్న ప్రముఖులను గుర్తించి గౌరవించడాన్ని ప్రశంసించారు. గోశాల నిర్వహిస్తున్న బ్రాహ్మణోత్తములను గోశాలలో సత్కరించడం గొప్ప విషయమని అభినందించారు. గోమాతలను పూజించే విధంగా సమాజంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం మనందరి పై ఉందన్నారు.
అనంతరం గౌరవ అతిథిగా హాజరైన బిర్లా మందిర్(Birla Mandhir) ప్రధాన అర్చకులు, లక్ష్మి నరసింహాచార్యులు(Lakshmi Narsimha Charyulu) మాట్లాడుతూ... గోశాలల ద్వారా వస్తున్న ఉత్పత్తిని పెంచుతూ ఆ పదార్థాలను బ్రాహ్మణ సమాజానికి సులభంగా అందేలా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా త్రిపురాంతక దేవాలయ ప్రధాన అర్చకులు, ప్రసాద్ శర్మ మాట్లాడుతూ... అనేక ఏళ్లుగా గోశాలను నిర్వహిస్తున్నాని ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సేవ చేస్తున్నాని, ఈ సమాఖ్య ఇలాంటి గోసంరంభం వేడుక ద్వారా బ్రాహ్మణులలో ఉత్తేజాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నాని తెలిపారు. సమాఖ్య వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస్(Bala Srinivas) మాట్లాడుతూ... చతుర్ధ వార్షికోత్సవం ద్వారా గోసంరంభన వేడుక నిర్వహిస్తామని తెలియజేసినప్పుడు ఎంతో మంది అభినందించారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గోశాలలను, బ్రాహ్మణులు తమ ఆదాయంలో ప్రతి నెలలో కొంత సొమ్మును గోశాలలకు అందిస్తూ ఆర్థికంగా ప్రోత్సహించాలని కోరారు. బ్రాహ్మణ వ్యాపారాలు, ఐటీ ఉద్యోగులు గోశాలలను ఆదుకోవాలన్నారు.
ప్రముఖ జ్యోతిష్య పండితులు ఫణిబాబు(Phanibabu) మాట్లాడుతూ... బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేక వినూత్నమైన కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవ చేస్తుందని, ఇలాంటి సేవల ద్వారా బ్రాహ్మణుల గౌరవం పెరగడంతో పాటు ఐక్యత, సంక్షేమానికి బాటలు పడతాయని వివరించారు. అనంతరం బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉపాధ్యక్షులు కిషన్ రావు మాట్లాడుతూ చతుర్ధ వార్షికోత్సవం సందర్భంగా తమ సమాఖ్య దాదాపు 250 నూతన సభ్యులను చేర్చుకుని నియామక పత్రాలను అందజేసినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో సైతం తమ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తామని వెల్లడించారు. ఈ సభ లో రాపాక ప్రభాకర్ బాబు, రవికుమార్, భగవాన్ శంకర్, మోహన్ కుమార్ గాంధీ, పావని శర్మ, చొప్పకట్ల రాము, మిర్తిపాటి రామం, గొల్లపల్లి ఫణిందర్, నేరళ్ల మల్లికార్జునరావు, చోడవరపు శ్రీనివాసరావు, రాజేశ్వర రావు, యుగంధర్, జనగామ చంద్రశేఖర్, ఉదయ్, సుబ్రహ్మణ్యం బాల, శారదా, ఉజ్వల, రమణి పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత జరిగిన సన్మాన వేడుకలో దాదాపు 70 మందిని బ్రాహ్మణ గోశాల నిర్వాహకులు బ్రాహ్మణ శ్రేష్ఠ బిరుదుతో సత్కరించారు. కార్యక్రమానికి ముందు 70 మంది చిన్నారుల కూచిపూడి, భరతనాట్యం నాట్య ప్రదర్శన సభికులను ఎంతగానో ఆకర్షించింది. సంస్థ సహా కార్యదర్శి గొల్లపల్లి ఫణిందర్ శర్మ వందన సమర్పణ చేశారు.