- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమలులోకి మళ్లీ కోవిడ్ నిబంధనలు...
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలుతప్పనిసరి చేశాయి. తాజాగా మూడు రాష్ట్రాలు మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేశాయి. హర్యానా, కేరళ , పుదుచ్చేరిలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించాయి. కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన హర్యానా ప్రభుత్వం ముందుజాగ్రత్తగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ఆదేశించింది.
అటు.. కేరళలోనూ గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పినరయ్ విజయన్ సర్కార్ ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ పుదుచ్చేరి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రులు, హోటళ్లు, మద్యం దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. ఇప్పటికే దేశంలో కోవిడ్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసర సేవలను అంచనా వేయడానికి సోమ, మంగళవారాల్లో మాక్ డ్రిల్ చేపట్టాలని స్పష్టం చేసింది.