CBI ఛార్జిషీటుకు కోర్టు గ్రీన్ సిగ్నల్

by samatah |   ( Updated:2022-12-15 12:00:59.0  )
CBI ఛార్జిషీటుకు కోర్టు గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణం సరికొత్త మలుపు తీసుకున్నది. సీబీఐ సమర్పించిన ఛార్జిషీటుకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు గురువారం ఆమోదం తెలిపింది. ట్రయల్ సందర్భంగా ఆ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఛార్జిషీటులో పేర్కొన్న ఏడుగురు నిందితులకు సమన్లను జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 3 నుంచి మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. నిందితుల్లో ఇద్దరు సస్పెండ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులుకాగా మిగిలిన ఐదుగురు ప్రైవేటు వ్యక్తులు.

ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ పాలసీలో అవకతవతలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని, అవినీతి జరిగిందంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ హోం శాఖ డైరెక్టర్ ఆగస్టులో నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం ఆగస్టు 17న సీబీఐ మొత్తం 15 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత పలువురిని అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత అరెస్టు చేసి వారి నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్ ఆధారంగా పది వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను గత నెల 25న స్పెషల్ కోర్టులో సీబీఐ తరఫు న్యాయవాది సమర్పించారు.

సీబీఐ ఎఫ్ఐఆర్‌లో మొత్తం 15 మంది నిందితులు ఉంటే ఛార్జిషీట్‌లో మాత్రం ఏడుగురిని పేర్కొన్నది. ఇందులో మాజీ డిప్యూటీ కమిషనర్ (ఢిల్లీ ఎక్సయిజ్) కుల్‌దీప్ సింగ్, అసిస్టెంట్ కమిషనర్ నరేంద్రసింగ్ కాగా మిగిలిన ఐదుగురు ప్రైవేటు వ్యక్తుల్లో బోయిన్‌పల్లి అభిషేక్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, సమీర్ మహేంద్రు, ముత్తా గౌతమ్ ఉన్నారు. ఇటీవలే ఒక సాక్షిగా కల్వకుంట్ల కవితను ఏడున్నర గంటల పాటు విచారించిన సీబీఐ సీఆర్‌పీసీలోని సెక్షన్ 91 ప్రకారం నోటీసులు జారీచేసింది. ఆమె దగ్గర ఉన్న ఆధారాలను, డాక్యుమెంట్లను సమర్పించాల్సిందిగా సీబీఐ ఆదేశించింది.

Also Read...

Himachal Pradesh నూతన సీఎం సుఖు కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed