- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌తోనే దేశ భవిష్యత్ సాధ్యం: పవన్‌ఖేరా
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు నమ్మకం అన్నారు. దేశ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే సాధ్యం అన్నారు. కర్ణాటక ఫలితాలు చారిత్రాత్మక మైనవని, కాంగ్రెస్‌పార్టీకి మంచి రోజులు వచ్చాయన్నారు. ఏకంగా ప్రధాని ప్రచారం చేసినా.. బీజేపీ అధికారంలోకి రాలేకపోయిందన్నారు. దేశ ప్రధానిగా ప్రజలను విభజించే పని చేయడం బాధాకరమన్నారు.
ప్రధానికి దేశ భవిష్యత్‌తో పని లేదన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రధానికి పట్టవని విమర్శించారు. తెలంగాణలో మతసామరాస్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. గతంలోఅస్సాం సీఎం అదే పని చేయగా.. మణిపూర్‌లోనూ అదే చేశారన్నారు. దీంతో జనాలు చస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఎమోషన్లు సర్వసాధారణమని, కానీ కక్ష్యపూరిత చర్యలు తగవన్నారు. రాజస్థాన్, ఛత్తీస్ గడ్, హిమాచల్‌లో ఇచ్చిన హామీలను మొదటి కేబినెట్‌లోనే ఆమోదించామన్నారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా ఫస్ట్కేబినేట్లోనే నెరవేర్చుతామన్నారు.