- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PSLV C-59 : పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్
దిశ, వెబ్ డెస్క్ : ఇస్రో రేపు సాయంత్రం 4:08గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ-59(PSLV C-59 rocket)రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్(Countdown)ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.38 నిమిషాలకు కౌంట్ డౌన్ మొదలైన కౌంట్ డౌన్ మొదలైంది. శ్రీహరికోట సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉప గ్రహంతో పాటు అందులోని రెండు చిన్న ఉపగ్రహాలు 310 కేజీల బరువైన కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, 240 కేజీల ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్‌లను శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు.
సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం అవి పరస్పరం సమన్వయంతో ఒకే భూ కక్షాలో విహరిస్తాయి. కృత్రిమంగా సూర్య గ్రహణాన్ని సృష్టించడం వంటి ప్రయోగాలకు ఈ ఉపగ్రహ ప్రయోగం కీలకం కానుంది. ఈ తరహా ప్రయోగం ప్రపంచంలోనే ఇదే మొదటిసారని ఇస్రో ప్రకటించింది.