- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
RS Praveen Kumar : విద్యాలయాల్లో కౌన్సిలర్ వ్యవస్థను నియమించాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ, వెబ్ డెస్క్ : సంక్షేమ విద్యాలయాల(Wwelfare Schools Hostels)లో కౌన్సిలర్ వ్యవస్థ(Counselor System) లేక విద్యార్ధుల ఆత్మహత్యల(Student Suicides) పరంపర కొనసాగుతుందని ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar)ఎక్స్ వేదికగా ఆరోపించారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కౌన్సిలర్లను నియమించమని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి నేను గత ఏడాది నుంచి చెబుతున్నా మీరు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కౌన్సిలర్ వ్యవస్థ ఉండి ఉంటే బహుశా మధిర కిష్టాపురం ఎస్సీ గురుకుల విద్యార్థికి చావు గురించి ఆలోచన వచ్చేది కాదన్నారు.
భవిష్యత్తును భద్రంగా దాచుకునే ట్రంకు పెట్టెలు, బలవన్మరణాలకు సోపానాలు గా మారడం కాంగ్రెసు దుష్ట పాలనకు తార్కాణమని విమర్శించారు. నేటికి సంక్షేమ విద్యాలయాల్లో దాదాపు గా 55 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయారని, ఇంకెంతమందిని బలి తీసుకుంటారు? అని ప్రభుత్వాన్ని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. ఇప్పటికైనా సంక్షేమ విద్యాలయాల్లో కౌన్సిలర్లను నియమించి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని కోరారు.