TG Assembly: అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ కామెంట్స్ లొల్లి.. హరీశ్ రావు, బీర్ల ఐలయ్య కామెంట్స్ రిమూవ్

by Prasad Jukanti |
TG Assembly: అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ కామెంట్స్  లొల్లి.. హరీశ్ రావు, బీర్ల ఐలయ్య కామెంట్స్ రిమూవ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఓవర్సీస్ స్కాలర్ షిప్స్, కమీషన్లు, రోడ్ల నిర్మాణంపై మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి (Komati Reddy Venkat Reddy) మాట్లాడుతూ.. ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ రావు పని చేసి కాళేశ్వరంలో కమీషన్లు తీసుకున్నారు. మామ చాటు అల్లుడిగా రూ.10 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నేను చేస్తున్న ఈ ఆరోపణలను నిరూపిస్తానన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందిన హరీశ్ రావు.. నార్మల్ గా రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేస్తారు. ఇకపై అసెంబ్లీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు (Drunk and Drive tests at asembly) చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని, కొందరు సభ్యులు పొద్దున్నే తాగి వచ్చినట్టు మాట్లాడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య రచ్చ మొదలైంది.

హరీశ్ రావు క్షమాపణలు చెప్పాలి: పొంగులేటి

హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అని సభకే కాదు సమాజం తలదించుకునేలా ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు మీరే కాదు మా వైపున మాట్లాడినా ఇది తప్పు. ఈ విషయంలో హరీశ్ రావు సభకు క్షమాపణలు చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆరే తాగి పడిపోయారు: బీర్ల ఐలయ్య

హరీశ్ రావు వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) స్పందింస్తూ.. ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించాల్సిన వాళ్ల మామ కేసీఆర్ సభకు రాకుండా తాగి ఫామ్ హౌస్ లో పడుకుంటే గుర్తుకు వచ్చి హరీశ్ రావు అలా మాట్లాడినట్లు ఉందని విమర్శించారు. మంత్రి కొమటిరెడ్డిపై హరీశ్ రావు మాట్లాడిన తీరు దుర్మార్గం అన్నారు. మీకు ఉన్న అలవాట్లు మాకు ఉన్నాయని అంటున్నారని ఇది తప్పు అన్నారు. మీ నాయకుడు కేసీఆర్ తాగి హెలికాప్టర్ కింద పడిన సంగతి, తాగి ఫామ్ హౌస్ లో పన్న సంగతి యావత్ తెలంగాణ సమాజానికి తెలియనిదా? మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. అగ్గిపెట్టె హరీశ్ రావు ఈ రకంగా మాట్లాడటం దుర్మార్గం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో కలుగజేసుకున్న స్పీకర్ హరీశ్ రావు, బీర్ల ఐలయ్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.

Advertisement

Next Story