ఆత్మహత్యల నివారణలకు ప్రత్యేక చర్యలు..

by Sumithra |
ఆత్మహత్యల నివారణలకు ప్రత్యేక చర్యలు..
X

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో తరచూ జరుగుతున్న ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం బాసర గోదారి వద్ద ఘాట్స్ ను, బ్రిడ్జిని సిబ్బందితో కలిసి పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. బ్రిడ్జి పై ఐదు ఫీట్ల వరకు జాలి లాంటి నిర్మాణం ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూమ్ కి అటాచ్ చేసి 24/7 నిరంతర పరిశీలన చేస్తామని, రాత్రి వేళలో పెట్రోలింగ్ సమయాన్ని పెంచి, ప్రత్యేకంగా మహిళ పోలీసులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అవసరం మేరకు నిజామాబాద్ సీపీ కో ఆర్డినేషన్తో పనిచేసి ఆత్మహత్య నివారణకు పాటుపడతామన్నారు. ఎస్పీతో ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సీఐ మల్లేష్, ఎస్సై గణేష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed