Congress: కేటీఆర్ స్పందన ఏది?.. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి

by Ramesh Goud |
Congress: కేటీఆర్ స్పందన ఏది?.. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్(BRS) పదేళ్ల పాలనలో చేసిందంతా రేవ్ పార్టీ(Rave Party) లేనని, ఈ ఘటనపై కేటీఆర్(KTRBRS) ఎందుకు స్పందించట్లేదని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి(Shivasena Reddy) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ యూనివర్సిటీ(Sports University)తో ఆరోగ్య తెలంగాణ దిశగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అడుగులు వేస్తుంటే.. బీఆర్ఎస్ డ్రగ్స్ దిశగా ముందుకు పోతుందని మండిపడ్డారు. అలాగే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిందంతా రేవ్ పార్టీలేనని, యువకులను మత్తుకు బానిసలుగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక బీఆర్ఎస్ యువత జీవితాలను నిర్విర్యం చేసిందని, తెలంగాణలో ఈ డ్రగ్స్ పార్టీ.. రేవ్ పార్టీ కల్చర్ పోవాలని కోరుకున్నారు.

రాష్ట్రంలో డ్రగ్స్ ను నిర్మూలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కృషి చేస్తుంటే.. కేటీఆర్ బావమరిది స్వయంగా డ్రగ్స్, రేవ్ పార్టీల పేరుతో వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇంతా జరుగుతున్నా కేటీఆర్ దీనిపై ఎందుకు స్పందించట్లేదని నిలదీశారు. అంతేగాక దీని వెనుక ఎంతటివారు ఉన్నా శిక్షించాల్సిందేనని అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పార్టీలు చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం క్షమించదని గ్రామ స్థాయిలో మెసేజ్ వెళ్లేలా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం తమకుందని చెప్పారు. తెలంగాణ యువతను ఓ ఆరోగ్య దోరణిలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. మళ్లీ పాత దోరణికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని విమర్శలు గుప్పించారు. అలాగే దీని వెనుక ఎంతటివారున్న ఖచ్చితంగా శిక్షించాల్సిందేనని పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నానని శివసేనా రెడ్డి అన్నారు.

Advertisement

Next Story