- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister KTR టార్గెట్‌గా తెరపైకి మరోసారి పాత ఛాలెంజ్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై పొలిటికల్ పార్టీల మధ్య వార్ నెలకొంది. ఈ అంశంపై నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య బెంగళూరు డ్రగ్స్ కేసు విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో విసిరిన ఛాలెంజ్‌ను మళ్లీ తెరపైకి తీసుకువస్తోంది కాంగ్రెస్. మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా జరుగుతున్న ఈ ప్రయత్నం మరోసారి హాట్ టాపిక్ అయింది. తాజాగా డ్రగ్స్ కల్చర్‌పై యువతలో అవగాహన కల్పించే నిమిత్తం వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించానని ఇందులో భాగంగా ల్యాబ్‌లో తన రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను ఇచ్చానని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కేటీఆర్‌కు వైట్ ఛాలెంజ్ కొనసాగింపు తాను ల్యాబ్‌లో శాంపిల్స్ ఇచ్చానని ఆ తర్వాత అమరవీరుల విగ్రహం వద్దకు వెళ్తుండగా పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారని శనివారం జడ్సన్ ట్వీట్ చేశారు.
గతంలో మెలిక పెట్టిన కేటీఆర్:
మంత్రి కేటీఆర్ విషయంలో ప్రతిపక్షాలు చాలా కాలంగా ఘాటుగా రియాక్ట్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మాట్లాడిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. మంత్రి కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస అయ్యాడని ఆరోపించారు. అతడి రక్త నమూనా ఇస్తే నిరూపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కేటీఆర్ విషయంలో చాలా కాలంగా ప్రతిపక్షాలు పదే పదే ఇదే తరహా ఆరోపణలు చేస్తున్నా గతేడాది టీపీసీసీ తెరపైకి మరో వ్యూహంతో వచ్చారు. డ్రగ్స్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య గతేడాది సెప్టెంబర్‌లో ట్విట్టర్ వార్ జరిగింది. ఈ సందర్భంలో దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ కల్చర్‌పై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌ను.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్సెప్ట్ చేశారని.. మంత్రి కేటీఆర్ కోసం అమరవీరుల స్థూపం వద్ద ఎదురు చూస్తానని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ నేను ఏదైనా పరీక్షకు సిద్ధంగా ఉన్నానన్నారు. అయితే రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమా? అని మెలిక పెట్టారు. ఒకవేళ పరీక్షలకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉంటే ఢిల్లీ ఎయిమ్స్‌లో టెస్టులకు వెళతానని మెలిక పెట్టారు. ఆ తర్వాత ఈ వ్యవహారం సైలెంట్ అయింది. తాజాగా బెంగళూరు డ్రగ్స్ కేసుపై ప్రచారం పెరగడంతో వైట్ ఛాలెంజ్‌ను తిరిగి కాంగ్రెస్ పార్టీ నేత బక్క జడ్సన్ గుర్తు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
రేవంత్ రెడ్డికి మరో షాక్.. టీ-కాంగ్రెస్ సీనియర్ నేతల సంచలన నిర్ణయం