కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. Revanth Reddy వ్యాఖ్యలపై గరం గరం

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-10 04:10:11.0  )
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. Revanth Reddy వ్యాఖ్యలపై గరం గరం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార బీఆర్ఎస్ స్వరం మార్చింది. ఇన్నాళ్లు బీజేపీకి ఇంపార్టెన్స్ ఇస్తూ విమర్శలు చేసిన ఆ పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింది. ప్రగతి భవన్‌పై టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగింది. పలు చోట్ల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇవి చూస్తే వ్యూహం ప్రకారమే అధికార పార్టీ కాంగ్రెస్‌ను టార్గెట్ పెట్టిందా? అని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయింది.

ప్రగతి భవన్ వ్యాఖ్యలపై..

హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి తన స్పీచ్‌లో 'ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చేయాలి' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఇద్దరు మంత్రులు ఐదుగురు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించి రేవంత్‌పై ఎదురుదాడికి దిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల రేవంత్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. పాదయాత్ర మొదలు పెట్టినా ప్రజల నుంచి స్పందన లేకనే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

అదే స్థాయిలో కాంగ్రెస్ ఫైర్

బీఆర్ఎస్ విమర్శలపై కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నది. రేవంత్ వ్యాఖ్యలపై టీపీసీసీ సీనియర్ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్ గాంధీభవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి మద్దతు తెలిపారు. ప్రజాధనంతో కట్టిన సీఎం అధికారిక భవనంలోకి సామాన్యులకు ఎందుకు ఎంట్రీ లేదని ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ క్యాడర్ నుంచి రేవంత్‌కు మద్దతు లభించింది. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు రేవంత్ రెడ్డి కూడా బుధవారం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

వ్యూహం ప్రకారమేనా..?

కొన్నాళ్ల నుంచి రాష్ట్రంలో రాజకీయం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యనే సాగింది. బీజేపీ బలపడుతుండడంతో ఇది తమకు నష్టం చేకూర్చేలా ఉన్నదని బీఆర్ఎస్ అలర్ట్ అయినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌తోనే తమకు పోటీ ఉంటుందనే సంకేతాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే హస్తం నేతలను టార్గెట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలు ఎక్కువవడం విశేషం. ఇది ఏ పార్టీకి లాభం చేకూర్చి, ఏ పార్టీని నష్టపరుస్తుందనేది వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి : కొత్తగా 13 పోలీస్ స్టేషన్ల ఏర్పాటు! పైరవీలు స్టార్ట్

Advertisement

Next Story

Most Viewed