- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Congress: మాటల ప్రభుత్వానికి.. చేతల ప్రభుత్వానికి తేడా ఇదే: సామా రామ్మోహన్
దిశ, వెబ్ డెస్క్: నాటి మాటల ప్రభుత్వానికి.. నేటి చేతల ప్రభుత్వానికి తేడా స్పష్టంగా తెలుస్తున్నదని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్(Congress Media Committee Chairman) సామ రామ్మోహన్ రెడ్డి(Sama Ram Mohan Reddy) అన్నారు. తెలంగాణ యువతలో తగ్గుతున్న నిరుద్యోగం(Unemployment) అని, ఏడాదిలో 22.3 శాతం నుంచి 18.1 శాతానికి పడిపోయిందని వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన.. ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణ ప్రజాపాలన ఘనత వల్ల ఏడాదిలో నిరుద్యోగ శాతం భారీగా తగ్గిందని, కేంద్ర కార్మిక బలగం త్రైమాసిక నివేదికలో వెల్లడించిందని చెప్పారు. గత ఏడాది 2023 జులై- సెప్టెంబర్ రాష్ట్ర నిరుద్యోగ శాతం (బీఆర్ఎస్ హాయాంలో) - 22.9 శాతం ఉండగా.. 2024 జులై- సెప్టెంబర్ లో తెలంగాణలో నిరుద్యోగ శాతం (కాంగ్రెస్ పాలనలో)- 18.1 శాతంగా నమోదు అయ్యిందని తెలిపారు. ఇక గత ఆరు నెలల్లో ప్రభుత్వ(Government), ప్రైవేటు(Private) రంగాల్లో భారీగా పెరిగిన ఉద్యోగ అవకాశాలే దీనికి కారణమని నివేదికలో వెల్లడైనట్లు సామా వివరించారు.