- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ దోపిడీ సెకండ్ఎపిసోడ్.. యశోదా ఆస్పత్రి అక్రమాలు బట్టబయలు చేసిన రేవంత్ రెడ్డి!
దిశ, తెలంగాణ బ్యూరో: హైటెక్ సిటీ పరిధిలో రూ.800 కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.100 కోట్లకే యశోదా సంస్థకు కేటాయించినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో అమెరికాకు చెందిన అలగ్జాండ్రియా అనే కంపెనీకి శేరిలింగంపల్లి మండలం, ఖానామేట్ గ్రామం సర్వే నెంబర్ 41/14 లో ఐదు ఎకరాల స్థలాన్ని, ఎకరం రూ.10 కోట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందన్నారు. అయితే జీవో నెంబర్ 1484, లోకాయుక్త అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత అక్కడ ఎకరం రూ.12 కోట్లు ఉన్నదని నిర్ధారణ కావడంతో ఆ సర్వే నంబరులో స్థలం పొందిన అలగ్జాండ్రియాతో పాటు మారుతీ సుజుకీ కంపెనీలకు 05 -06 –2012న హెచ్ఎండీఏ లేఖ రాసిందన్నారు. సదరు సర్వే నెంబర్‌లో ఎకరం రూ.12 కోట్లు ధర పలుకుతున్నందున ముందుగా చెల్లించిన మొత్తానికి అదనంగా, ఎకరానికి మరో రూ.2 కోట్లు చెల్లించాలని ఆ లేఖలో పేర్కొందన్నారు. ఈ లేఖపై స్పందించిన మారుతీ సుజుకీ తనకు కేటాయించి రెండు ఎకరాల స్థలానికి అదనంగా చెల్లించాల్సిన రూ.4 కోట్లు చెల్లించిందన్నారు. అలగ్జాండ్రియా మాత్రం ఈ అంశంపై కోర్టుకు వెళ్లిందని, ఆ వివాదం నడుస్తుండగానే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని రేవంత్ గుర్తుచేశారు.
ఇక ఆ తర్వాత ఖానామేట్ గ్రామంలో సర్వే నెంబర్ 41/14లో ఉన్న భూమిపై కల్వకుంట్ల మాఫియా కన్నుపడిందని మండిపడ్డారు. అలగ్జాండ్రియాకు కేటాయించిన ఐదెకరాలతో పాటు దాని పక్కనే ఉన్న మరో మూడెకరాల అత్యంత ఖరీదైన భూమిపై కల్వకుట్ల మాఫియా కన్నుపడిందన్నారు. భూమి ధర వివాదం కోర్టులో ఉండటంతో దానిని సాకుగా చూపి అలగ్జాండ్రియాను బెదిరించి 2016లో అలగ్జాండ్రియా కంపెనీలోకి కల్వకుంట్ల జగన్నాథరావు, గోరుకంటి రవీందర్ రావు, గోరుకంటి దేవేందర్ రావు డైరెక్టర్లుగా చొరబడ్డారన్నారు. జగన్నాథ రావుకు కల్వకుంట్ల అనే ఇంటి పేరు తప్పా.. ఎలాంటి అర్హత లేదని తెలిపారు. ఆ తర్వాత కోర్టులో ఉద్ధేశ పూర్వకంగానే కేసు ఓడిపోయి, తన మాఫియా సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న అలగ్జాండ్రియాకు రూ.500 కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేశారన్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు అదనంగా రావాల్సిన రూ.10 కోట్లు (5 ఎకరాలు × 2 కోట్లు = 10 కోట్లు) రాలేదు. రూ.500 కోట్ల అత్యంత విలువైన ప్రభుత్వ భూమి అతి తక్కువకే కల్వకుంట్ల మాఫియా పరమైందన్నారు. 2018 లో ఈ భూ వివాదంపై కావాలనే కేసు ఓడిపోయారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సుప్రీం కోర్టులో ఎందుకు అప్పీల్‌కు వెళ్లలేదు? అని రేవంత్ ప్రశ్నించారు. అర్హత లేకపోయినా వారికి కట్టబెట్టిన భూమిని వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందన్నారు.
లిక్కర్‌స్కామ్ వ్యక్తులకు 25 ఎకరాలు..20 శాతం కేటీఆర్‌కు కమీషన్లు...!
లిక్కర్ కుంభకోణంలో ఉన్న వ్యక్తులకు ఏకంగా 25 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లు రేవంత్ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను బుధవారం ప్రకటిస్తానని వెల్లడించారు. ఇక నగరంలో భవనాల అనుమతుల్లోనూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారన్నారు. భూ ప్రపంచంలో ఎక్కడా.. ఎకరాకు లక్ష, లక్షన్నర చదరపు గజాలకు అనుమతి లేదన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఎకరాకు 5 లక్షల చదరపు గజాలకు అనుమతి ఇవ్వడం విచిత్రంగా ఉన్నదన్నారు. అందులో 20 శాతం కమీషన్ల కోసం కేటీఆర్ ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారన్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, నాగార్జున సర్కిల్‌లో భవనాలకు అదనపు అంతస్థులకు అనుమతులు ఎలా ఇచ్చారో? కేటీఆర్ చెప్పాలన్నారు. ఇలాంటి విధానాలతో నార్సింగి, పుప్పాలగూడా ప్రాంతాల్లో భవిష్యత్తులో ఎవరూ నివసించలేని పరిస్థితి వస్తుందన్నారు. ‘జూబ్లీహిల్స్ కేబీఆర్ పక్కన నమస్తే తెలంగాణకు 3 వేల గజాలు ఎలా? వచ్చింది 5 అంతస్తులు కట్టాల్సిన బిల్డర్ 16 అంతస్తులు కడుతుంటే కేటీఆర్ ఏం చేస్తున్నారు?’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.