- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేరికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్.. జిల్లా ముఖ్య లీడర్లపై దృష్టి
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌పార్టీ అధికారం కోసం పావులు కదుపుతున్నది. దీనిలో భాగంగా అసంతృప్తితో నేతలను టార్గెట్ చేసింది. పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల్లోని లీడర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో అసంతృప్తులకు గాలం వేసి కాంగ్రెస్కండువా కప్పాలని నిర్ణయించుకున్నది.
జిల్లాల వారీగా చేరికలపై ఫోకస్పెట్టాలని ఇప్పటికే టీపీసీసీ అంతర్గతంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఆయా జిల్లాల్లో ప్రభావం చూపగల్గిన నేతలపై ఆరా తీస్తున్నారు. అన్ని జిల్లాల్లో ముఖ్య లీడర్లు, ద్వితీయ శ్రేణి నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని డీసీసీ అధ్యక్షులకు కొత్త టాస్క్ఇవ్వడం గమనార్హం. కాంగ్రెస్‌పార్టీలో ఉన్న వారిని సమన్వయం చేస్తూనే ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని టీపీసీసీ అన్ని జిల్లాల డీసీసీలకు ఇంటర్నల్‌గా ఆదేశించినట్లు తెలిసింది.
ఎన్నికల హీట్..
ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున కాంగ్రెస్‌పార్టీ ఇప్పట్నుంచే తన ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. పార్టీ బలోపేతం కోసం వివిధ రకాల విధానాలను అవలంబిస్తోంది. అధికారం కోసం తనదైన శైలిలో పావులు కదుపుతున్నది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. అయితే ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో మాత్రమే పార్టీకీ తగినంత మద్దతు లభిస్తుంది. ఇది అధికారాన్ని తీసుకొచ్చేంత సరిపోదని ఇటీవల ఏఐసీసీ ముఖ్య నాయకులు టీపీసీసీకి సూచించారు. దీంతో ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నేతల పై ఫోకస్‌పెట్టారు. డీసీసీ అధ్యక్షులు ముఖ్య నేతల జాబితాను తయారు చేయాలని టీపీసీసీ సూచించింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను ప్రభావితం చేయగలిగిన లీడర్లను గుర్తించాలని పేర్కొన్నది.
అన్ని పార్టీల్లోనూ..
రాజకీయాల్లో సహజంగానే లీడర్లలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీతో పాటు కాంగ్రెస్‌లోనూ చాలా మంది లీడర్లు టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే టికెట్లు రాని వారు పార్టీలు జంప్అయ్యే ఛాన్స్ఉంది. దీంతో సొంత పార్టీ నేతలకు ఇబ్బంది లేకుండా చూస్తూనే.. ఇతర పార్టీల్లో ప్రభావం చూపగలిగిన లీడర్లకు కాంగ్రెస్కండువా కప్పాలని ఢిల్లీ పెద్దలు స్థానిక కాంగ్రెస్‌పార్టీకి సూచించారు. ప్రస్తుత సిచ్వేషన్ప్రకారం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌లోనే ఎక్కువ అసంతృప్తి ఉన్నట్లు పొలిటికల్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో వాళ్లందరినీ కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చే బాధ్యతలు డీసీసీ తీసుకోవాలని టీపీసీసీ పేర్కొన్నది. దీంతో పాటు గతంలో కాంగ్రెస్‌లో కొనసాగి.. బీఆర్ఎస్‌లో చేరి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నవారిని సంప్రదించాలని పార్టీ సూచించింది. రెండు, మూడు నెలల్లో చేరికలపై ఫోకస్పెడితే, ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీకి సులువుగా ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే పార్టీ ఇచ్చిన ఈ కొత్త టాస్క్‌ను డీసీసీలు ఏ మేరకు సమర్థవంతంగా నిర్వహిస్తారనేది చూడాల్సిందే..!