- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ అభ్యర్థులకు BIG అలర్ట్.. ఇవాళే లాస్ట్ డేట్
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ దరఖాస్తు ప్రక్రియ శనివారంతో ముగియనున్నది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే అప్లికేషన్లకు చాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ డే కేవలం 7 అప్లికేషన్లు రాగా, రెండో రోజు 34, మూడో రోజు ఏకంగా 140 దరఖాస్తులు వచ్చాయని టీపీసీసీ స్పష్టం చేసింది. అంటే ఇప్పటి వరకు వరకు 181 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజక వర్గాలకు అధికంగా దరఖాస్తులు రాగా, హైదరాబాద్‌కు అతి తక్కువ గా వచ్చాయి. గడిచిన మూడు రోజులుగా దరఖాస్తు చేసినోళ్లలో మంత్రుల భార్యలు, ప్రభుత్వ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, సినీ ప్రముఖులు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పవర్ లోకి రావడంతో టికెట్ల కోసం అప్లికేషన్లు పెరిగాయని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఇది పార్టీకి మంచి శుభపరిణామనని, ఎంపీ ఎన్నిల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడం పక్కా అంటూ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అప్లయ్ చేసిన కీలక వ్యక్తులు
ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి సతీమణి, వీవీసీ గ్రూప్ సంస్థ ఎండీ రాజేంద్ర ప్రసాద్, భువనగిరి నుంచి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్నలు దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్ గిరి నుంచి కపిలవాయి దిలీప్ కుమార్, సినీ నిర్మాత బండ్ల గణేష్, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, చారగొండ వెంకటేశ్ దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్ నుంచి ఆకుల లలిత, నాగర్ కర్నూల్ నుంచి మంద జగన్నాథం, ఆదిలాబాద్ నుంచి ఐఆర్ఎస్ ఆఫీసర్ రాథోడ్ ప్రకాశ్ అప్లికేషన్లు అందజేశారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ కార్మిక అసిస్టెంట్ కమిషనర్ కూరాకుల భారతి కూడా దరఖాస్తు చేశారు.అంతేకాకుండా పెద్దపల్లి టికెట్ కోసం ఆగమ చంద్రశేఖర్, నాగర్ కర్నూల్ టికెట్ కోసం ఆయన కూతురు ఆగమ చంద్రప్రియ దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.