పాలనలో 50 రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్.. 6 గ్యారంటీలపై కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2024-01-24 14:21:06.0  )
పాలనలో 50 రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్.. 6 గ్యారంటీలపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీల్లో ఈ యాబై రోజుల్లో రెండు పథకాలను అమలు చేశారు. మరో నాలుగు పథకాలు అమలు చేయాల్సి ఉంది. అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తమ పాలనలో తెలంగాణ ప్రజలు అనందంగా ఉన్నారని, ఈ 50 రోజలు పాలనను గోల్డెన్ రూలింగ్‌గా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి తెలిపారు. తెలంగాణలో తొలిసారిగా ప్రజాసామ్య పునరుద్ధరగా జరిగినట్లుగా ప్రజలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.


తామిచ్చిన 6 గ్యారంటీల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీని అమలు చేశామని మల్లు రవి తెలిపారు. మిగిలిన 4 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 50 రోజుల పరిపాలన స్వర్గయుగంగా ప్రజలు భావిస్తున్నారు. ఇలానే మున్ముందు కొనసాగిస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు. అయితే పోటీపై నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానమని మల్లు రవి స్పష్టం చేశారు.

కాగా 2023 నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు వచ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

Read More..

తెలంగాణ పాలిటిక్స్‌లోకి ‘మాస్టర్ మైండ్’ రీ ఎంట్రీ.. CM రేవంత్‌కు కీలక సూచనలు..!

Advertisement

Next Story

Most Viewed