BRS VS CONGRESS: ఎక్స్ వేదికగా బ్యాగ్ మ్యాన్, పాస్‌పోర్టు బ్రోకర్ ట్రెండ్!

by Ramesh N |
BRS VS CONGRESS: ఎక్స్ వేదికగా బ్యాగ్ మ్యాన్, పాస్‌పోర్టు బ్రోకర్ ట్రెండ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వీడియోలు పెడితే కేసులు పెడుతున్నారట.. అందుకే బ్యాగ్ ఫోటో మాత్రమే పెడుతున్నాం! మిత్రులారా, మీరు కూడా మీ ఫేవరెట్ బ్యాగ్ ఫోటోని #BagMan హాష్ ట్యాగ్ తో పోస్ట్ చేయండి.. అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా తాజాగా పోస్ట్ చేసింది. ఓటుకు నోటు కేసుపై సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. అయితే, బీఆర్ఎస్ పిలుపుతో బ్యాగ్‌మ్యాన్‌కు సంబంధించిన హాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో బీఆర్ఎస్‌కు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది.

మహారాష్ట్ర రాజకీయాల కోసం మీరు తీసుకెళ్లిన బ్యాగ్ ఏది? అని టీ కాంగ్రెస్ ప్రశ్నించింది. వందల కోట్ల డబ్బును తరలించిన గొనె సంచులు పామ్ హౌస్ లో ఉన్నాయా? అని నిలదీసింది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కోసం కొనుగోలు కోసం మీ నాయకురాలు కవిత తీసుకెళ్లిన బ్యాగ్ ఏ కలర్? మీ నాయకుడు ఢిల్లీకి మోసే సంచులు ఏ కలర్? మీ రాజకీయ లబ్ధి కోసం వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు తీసుకెళ్లిన బ్యాగ్ మీకు గుర్తుందా? పాస్ పోర్ట్ ల కుంభకోణంలో మీ నాయకుడు పట్టుబడినప్పుడు పత్రాల కోసం ఏబ్యాగ్ వాడాడు? మీ మిత్రుడు జగన్ ఎన్నికల ఖర్చు కోసం తెలంగాణ నుంచి ఎన్ని బ్యాగులు పంపారు? బ్యాగులు మోసే మీ నాయకుడు హరీష్ రావుకు అన్ని తెలుసు కేటీఆర్.. వారిని అడగండి బ్యాగుల గురించి చెబుతారు. మీ నాయకురాలు కవిత బ్యాగులు మోసే బాల్క సుమన్‌ను అడగండి.. ఎన్ని రకాల బ్యాగ్‌లు మోసాడో, వాటి రంగు, వాటి ధర అందులో వస్తువుల ధరతో సహా అన్ని వివరాలు చెబుతాడు. దుబాయ్ బురుజులో మీరు దాచిన బ్యాగుల లెక్క ఎప్పుడు చెబుతారు? అని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రశ్నలు వేసింది.

కాంగ్రెస్ పార్టీ ఇంకో ట్వీట్ చేస్తూ.. దొంగ పాస్ పోర్టుల తయారీ, మనుషుల అక్రమ రవాణా, పాస్ పోర్ట్ బ్రోకర్.. అనగానే మీకు టక్కున గుర్తొచ్చేదెవరో కింద కామెంట్ చేయండి. #PassportBroker హ్యాష్ టాగ్ తో ట్వీట్ చేయండి.. అంటూ పోస్ట్ చేసింది.

Advertisement

Next Story