- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MBNR నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ శంఖారావం.. ముహూర్తం ఖరారు
దిశ, తెలంగాణ బ్యూరో: మహబూబ్ నగర్ నుంచి పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించనున్నది. మార్చి 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో "పాలమూరు ప్రజా దీవెన సభ" నిర్వహించనున్నారు. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పాలమూరు ప్రజాదీవెన సభతోనే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
ఆ తర్వాత ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌లో భారీ బహిరంగ సభలు ఏర్పాటుకు పార్టీ కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్‌లలో 14 సీట్లను కైవసం చేసుకోవాలని పార్టీ బలంగా పనిచేస్తున్నది. ఇప్పటికే రెండుసార్లు సీఎంతో భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ, ఒకటి రెండు రోజుల్లో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌కు మూడు పేర్లు చొప్పున సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితాను పంపనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీ నుంచి అభ్యర్ధులు లిస్టు ప్రకటించనున్నారు.