రామనవమి వేళ ‘జై శ్రీరాం’ బదులు కాంగ్రెస్ కొత్త స్లోగన్ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-17 12:33:36.0  )
రామనవమి వేళ ‘జై శ్రీరాం’ బదులు కాంగ్రెస్ కొత్త స్లోగన్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రామనవమి వేళ కాంగ్రెస్ కొత్త స్లోగన్ ఇంట్రడ్యూస్ చేసింది. బీజేపీ ‘జై శ్రీరామ్’ నినాదాన్ని ఓన్ చేసుకోవడంతో దానికి కౌంటర్‌గా ‘జై సీతారామ్’ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. జై సీతారామ్ అంటే ఏంటి అని రాహుల్ గాంధీ వివరించే వీడియోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది. జై సీత, జై రామ్ అంటే సీతా రాముడు ఒకటే అని అర్థం అని రాహుల్ గతంలో తెలిపిన వీడియోను షేర్ చేసింది. రాముడు జీవితం మొత్తం సీతమ్మ కోసం పోరాడాడని.. అందుకే జై సీతారామ్ అన్నప్పుడు మనం సీతమ్మను కూడా తలుచుకుంటామని రాహుల్ గాంధీ వీడియోలో తెలిపారు. బీజేపీ వాళ్లు ‘జై సీతారామ్’ కు బదులు ‘జై శ్రీరాం’ అంటారని.. ఎందుకంటే వాళ్లు సీతమ్మను గుర్తించరన్నారు. బీజేపీ వాళ్లు మహిళలను దేవతలుగా గుర్తించడానికి ఇష్టపడరన్నారు. అందుకే సీతమ్మ పేరు పలకరన్నారు. ఇక, కాంగ్రెస్ కొత్త నినాదం ‘జై సీతారామ్’కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed