- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొత్తు ఉంటుందని నేను చెప్పలేదు.. నా వ్యాఖ్యలు వక్రీకరించారు: కోమటిరెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎన్నికల తర్వాత హంగ్ వస్తుందని తాను అనలేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని మాకు ఎవరితోనూ పొత్తు ఉండబోదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండదని, బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవక తప్పదని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి నా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమైనవని సోషల్ మీడియాలో వచ్చిన సర్వే ఆధారంగా ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వస్తే పార్టీల బలాబలాలేంటో తాను చెప్పానంతే అన్నారు.
భవిష్యత్ లో సెక్యులర్ పార్టీలతో పొత్తు ఉంటే ఉండవచ్చునేమో కానీ బీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు ఉండబోదన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ లో చెప్పిన దాన్నే తాను రిపీట్ చేశానని అయితే బీజేపీ వాళ్లు దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ లో చిన్నచిన్న నాయకులు కూడా తనను ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో తిడుతునారని అన్నారు. తన వ్యాఖ్యలు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని అన్నారు. నాపై అధిష్టానం చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం తాను ఏ కమిటీలో లేనని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ -విజయవాడ హైవే గురించి మాట్లాడేందుకే గడ్కారీతో భేటీ అయ్యానని ఇది అఫిషియల్ మీటింగ్ అన్నారు.
బీఆర్ఎస్ తో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు ఉండదు:థాక్రే
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు థాక్రే స్పందించారు. వెంకట్ రెడ్డి ఏం మాట్లాడారో తనకు తెలియదన్నారు. రెండు రోజుల టూర్ కోసం నగరానికి వచ్చిన థాక్రే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు. వెంకట్ రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకున్న తర్వాతే స్పందిస్తానన్నారు. పొత్తులపై వరంగల్ సభలో రాహుల్ గాంధీ చెప్పిందే మాకు ఫైనల్ అని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు ఉండబోదని అన్నారు.