- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే ఆర్నెళ్లలో అందినకాడికి దోచుకోవడమే కేసీఆర్ టార్గెట్!
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను తెరమీదకు తీసుకువచ్చిదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. 111 జీవో పరిధిలోని భూములన్నింటినీ బీఆర్ఎస్ నేతలు, వ్యాపారవేత్తలు ముందుగా తమ చేతుల్లోకి తీసుకుని ఆ తర్వాతే ఇప్పుడు జీవోను తీసుకువస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో సీఎం కేసీఆర్‌కు తెలియడం లేదని అందువల్ల రాబోయే ఆర్నెళ్లలో అందిన కాడికి తెలంగాణను అమ్ముకుని పోవడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.
రెండవ పర్యాయం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక త్రిబుల్ వన్ జీవో పరిధిలో జరిగిన భూ బదిలీలు, ట్రాన్సక్షన్స్‌పై శ్వేతపత్రం విడుదల చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. హైదరాబాద్ జంట జలాశయాలకు కాళేశ్వరం ప్రత్యామ్నాయం కాదని ఈ జలాశయాలను ఎలా కాపాడుతారో కేసీఆర్ చెప్పాలన్నారు. ఇకనైనా త్రిబుల్ వన్ జీవోపై రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు.