- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక కాలువకైనా.. నా పేరు పెట్టండి.. ఇదే నా కోరిక.. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: మాకు కూడా ఒక కోరిక ఉంటదని అని కాంగ్రెస్ ఎమ్మెల్యే తుమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘నాకు కూడా ఓ కోరిక ఉంది అధ్యక్ష.. కనీసం నేను చనిపోయిన తర్వాత నా పరిగి నియోజక వర్గంలో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో రామ్మోహన్ రెడ్డి కాలువ అని పెడితే చాలు అధ్యక్ష.. అది కోరిక ఉంది’ అని అన్నారు. దీంతో అసెంబ్లీలో సభ్యులంతా నవ్వారు. మనం రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం.. కనీసం మనం మరణించిన తర్వాత మన పేరు ఎవరైనా యాది చేసుకోవాలని అని చెప్పారు. సీనియర్ నేత శ్రీపాద రావు పేరు మీద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పేరు పెట్టుకున్నారని గుర్తుచేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టారని గుర్తు చేశారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాకజెక్టు చేవెళ్ల వరకే ఉందన్నారు. ఇది చేవెళ్ల వరకే కాదు పరిగి వికారాబాద్, తాండూర్ వరకు రావాలని గత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వ పోడిగిస్తున్నామని చెప్పారని, కానీ ప్రాజెక్టు కట్ట లేదన్నారు. ప్రాజెక్టు కోసం ఎన్నో పోరాటాలు చేశామని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్న ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు.
పోరాడి సాధించుకున్న ప్రాజెక్టులను కట్టకుండా.. మొబిలైజేషన్ పేరిట కాంగ్రెస్ నాయకులు అడ్వాన్స్ తీసుకుంటున్నారని శాసన సభలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. మొబిలైజేషన్ విషయంలో ప్రూవ్ చేస్తే పరిగి ఎమ్మెలేగా రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారని విమర్శించారు.