కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రావాలని పొర్లు దండాలు

by Rajesh |   ( Updated:2024-06-24 12:53:02.0  )
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రావాలని పొర్లు దండాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు మంత్రి విస్తరణ దిశగా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు మంత్రి పదవి రావాలని యాదగిరి గుట్టలో ఆయన అభిమానులు పొర్లు దండాలు పెట్టారు. అయితే ప్రస్తుతం అభిమానులు యాదగిరి గుట్టలో పొర్లు దండాలు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు ఆయన అభిమానులు ‘కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు మంత్రి పదవి రావాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ఉండాలని పొర్లు దండాలు’ అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించారు.

Advertisement

Next Story

Most Viewed