ఓటు హక్కు వినియోగించుకోనున్న కాంగ్రెస్ కీలక నేతలు.. ఎవరు ఎక్కడంటే..?

by Mahesh |   ( Updated:2023-11-29 17:48:20.0  )
ఓటు హక్కు వినియోగించుకోనున్న కాంగ్రెస్ కీలక నేతలు.. ఎవరు ఎక్కడంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం తన ఓటును కొడంగల్ లోని జెడ్ పీహెచ్ ఎస్ బాయ్స్ సౌత్ వింగ్ పోలింగ్ బూత్ లో వినియోగించుకోనున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర పట్టణంలోని సుందరయ్య నగర్ మండల పరిషత్ స్కూల్‌లో ఓటు వేయనున్నారు. అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి లు కోదాడ లోని గ్రేస్ వ్యాలీ ఐడియల్ స్కూల్ లో ఓటు వేస్తారు.

ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకుంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నకిరేకల్ నియోజకవర్గం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో ఓటు వేయనున్నారు. జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలో ఓటు వేస్తారు. ఎమ్మెల్యే శ్రీధర్ మంథని నియోజకవర్గం కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. దీంతో పాటు సీతక్క ములుగు మండలంలోని జగ్గన్నపేట్‌లో తన ఓటు ను వినియోగించుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed