- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో ఖర్గే చొరవ అభినందనీయం: వీహెచ్
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌ను పోలీసులు సీజ్ చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులపై కూడా గతంలో సోషల్ మీడియాలో వార్తలు వస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన పీసీసీ కమిటీల విషయంలో పార్టీలో చెలరేగిన అంసతృప్తిపై రియాక్ట్ అయ్యారు. కమిటీల్లో అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలని అన్నారు. ఏదైనా ఉంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడాలని లేకుంటే హైకమాండ్ మాట్లాడాలని సూచించారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దామోదర రాజనర్సింహా చేసిన డిమాండ్ సమంజసమేనని ఆయన సూచించినట్టుగా రాష్ట్ర పార్టీలో ప్రక్షాళన జరగాల్సి ఉందన్నారు.
కమిటీల్లో అన్యాయంపై ఖర్గే దృష్టికి తీసుకువెళ్తానన్నారు. కేసీఆర్ పెట్టిన జాతీయ పార్టీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలని అన్నారు. దేశంలో గతంలో అనేక మంది జాతీయ పార్టీలు పెట్టారని, పార్టీ స్థాపించడం కంటే ఏ మేరకు సక్సెస్ అవుతారనేది ముఖ్యమన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ జనగణన జరపాలని కోరారు. బీసీ క్రిమిలేయర్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చైనా ఆగడాలను అడ్డుకోకుంటే దేశానికి నష్టం జరుగుతుందని అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని మల్లిఖార్జున ఖర్గే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు.