- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిలపై నాకు నమ్మకముంది.. వీహెచ్ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తొందరపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శించారు. వారు అధికారంలో ఉండగా దళితులకు 3 ఎకరాలు భూమి, ఇంటికో ఉద్యోగం అన్నారు. వాటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ పాలిటిక్స్‌లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చారని చెప్పారు.
ఆంధ్రాలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా వీహెచ్ శుభాకాంక్షలు తెలిపారు. షర్మిల ఏపీ రాజకీయాలకు సరిపోతారని ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే ఫైట్ చేయాలని తాను గతంలోనే చెప్పానని ఏపీలో షర్మిల బాగా పని చేస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను రేవంత్ రెడ్డి జిల్లాల్లో సభలు నిర్వహించి బయటకు తెచ్చారని కితాబిచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్‌గా ఇవ్వాలని ఇందుకు సమిష్టిగా పని చేయాలన్నారు.