రాజీవ్ గాంధీ నన్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడు: వీహెచ్

by GSrikanth |
రాజీవ్ గాంధీ నన్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడు: వీహెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా పార్టీలోకి రాగానే వాళ్లకు పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ పీసీసీ చీఫ్​వీ.హనుమంత రావు అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పదవులన్నీ ఒరిజినల్ కాంగ్రెస్​పార్టీ వాళ్లకే ఇవ్వాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్​హవా నడుస్తుందని, చేరికలు పెరిగే ఛాన్స్​ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నోళ్లను కాదని, కొత్తోళ్లకు అవకాశం ఇవ్వడం వలన కూడా పార్టీ డ్యామేజ్​అయ్యే ప్రమాదం ఉన్నదన్నారు. దీంతో పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని వీహెచ్ తెలిపారు. రేవంత్‌తో పాటు హై కమాండ్‌ను కూడా కోరతానని తెలిపారు. గతంలో రాజీవ్ గాంధీ తనను ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నాడని, కానీ బ్యాడ్ లక్​వలనే కాలేకపోయాయని వీహెచ్​అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్​హవా నడుస్తుందని, పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు మంచి రోజులు రాబోతున్నాయని వీహెచ్​ఆశాభవం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed