- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీసీ క్రిమిలేయర్ ఎత్తివేయాలి.. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ క్రిమిలేయర్విధానాన్ని ఎత్తివేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు పేర్కొన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగిన ఓబీసీ ఆల్ ఇండియా ఎంప్లాయిస్ ఫెడరేషన్ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ.. ఓబీసీకి ప్రత్యేక మినిస్ట్రీ అవసరం అన్నారు. 50 శాతం రిజర్వేషన్ సీలింగ్ తొలగించాలన్నారు. బీసీ వ్యక్తి ప్రధాన మంత్రిగా ఉండి బీసీలకు న్యాయం చేయలేకపోతున్నాడని విమర్శించారు. అందుకే దేశంలో ఓబీసీ క్యాస్ట్ వైస్ జనగణన జరగాలన్నారు.
పబ్లిక్ సెక్టార్ యూనిట్ లని ప్రైవేటు చేయడం మానేయాలన్నారు. అంతేగాక ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. జ్యూడిషియల్, ప్రైవేట్ సెక్టార్రిజర్వేషన్లు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కృష్ణయ్య , ఎక్స్ ఎంపీ ఆనంద్ భాస్కర్ , ఆల్ ఇండియా ఫెడరేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కరుణానిధి, తదితరులు పాల్గొన్నారు.