- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదలను మోసం చేస్తున్నందుకు కేసీఆర్‌కు సిగ్గుండాలి: వీహెచ్
దిశ, తెలంగాణ బ్యూరో: “డబుల్బెడ్రూమ్ఇళ్లకు రూ.2 లక్షలు, దళిత బంధుకు రూ.3 లక్షలు” వరకు కమీషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్మాజీ పీసీసీ చీఫ్హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పేదలను మోసం చేస్తున్నందుకు సిగ్గుండాలని ఫైర్అయ్యారు. దమ్ముంటే డబుల్ బెడ్రూమ్, దళితబంధు పంపిణీపై స్పెషల్ సిట్ వేయాలని కోరారు. విచారణ జరిగితే అన్నీ బయటకు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక వైపు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. రైతుల పట్ల కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారు. మహరాష్ట్రకు వెళ్లి కిసాన్ సర్కార్ అని ప్రగల్భాలు పలుకుతూ, మన రాష్ట్రంలో బాధ పడుతున్న రైతుల కన్నీళ్లకు కేసీఆర్కారణం అవుతున్నాడని విమర్శించారు. ఇక నూతన సచివాలయంలో అందరికీ ఆంక్షలు అంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.
రాబోయేది కాంగ్రెస్ప్రభుత్వమేనని, సూర్యపేటలో పెద్ద ఎత్తున బీసీ గర్జన సభ పెట్టాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఫిషర్మెన్కాంగ్రెస్ చైర్మన్మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాల పేరుతో అధికార పార్టీ కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. అధికార పార్టీ మత్సకారులను నిండా ముంచిందన్నారు. ఆంధ్రా వాళ్లకే చేప పిల్లల కాంట్రాక్టులు ఇచ్చిందన్నారు. చేప పిల్లల పంపిణీలోనూ ప్రభుత్వం 30 శాతం కమీషన్ తీసుకున్నదని ఆరోపించారు. కమీషన్ తీసుకోకుండా మత్సశాఖ సొసైటీలో సభ్యత్వం ఇవ్వడం లేదన్నారు. అంతేగాక సొసైటీల అధికారాలను తగ్గించి, నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. దీంతో జూన్ 8న ప్రభుత్వం చేపట్టే చెరువుల పండుగను బహిష్కరించి నిరసన తెలియజేయాలని సాయికుమార్పిలుపునిచ్చారు.