- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Union Minister Smriti Iraniకి దానిపై ఉన్న ఆసక్తి.. మణిపూర్ ఘటనపై లేదు: పాల్వాయి స్రవంతి ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలు అంటే అంత అలుసా అని టీపీసీసీ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ఘటనలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్అల్లర్లకు బీజేపీ కారణమన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ బలుపు మాటలు మాట్లాడుతుందన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతుందన్నారు. ప్రధాని ఇప్పటి వరకు స్పందింకపోవడం దారుణమన్నారు.
పైగా మణిపూర్ కల్లోలం గతంలో రాజస్థాన్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కంటే తక్కువేననడం ప్రధానమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. బీజేపీ మహిళా మంత్రి స్మృతి ఇరానీకి గాంధీ కుటుంబంపై వ్యాఖ్యలు చెయ్యడంలో ఉన్న ఆసక్తి.. మణిపూర్ ఘటనపై లేదన్నారు. బీజేపీలోని మహిళలైనా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని ఆమె కోరారు. సమస్యను వేగంగా పరిష్కరించేందుకు బీజేపీ మహిళా లీడర్లు కృషి చేయాలని స్రవంతి రిక్వెస్టు చేశారు. సాటి మహిళలుగా న్యాయం చేయాలని వెల్లడించారు.