- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలు.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలు అని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ... ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ప్రజలు బీఆర్ఎస్‌ను సంపూర్ణంగా తిరస్కరిస్తున్నారన్నారు. కేటీఆర్ మైండ్ పనిచేయడం లేదని, ఇప్పటికీ ఆయనకు పరిస్థితులు అర్థం కాకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. ఓటమిని అంగీకరించలేని స్థితిలో బీఆర్ఎస్ నాయకులు ఉండటం విచిత్రంగా ఉన్నదన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే విజయమన్నారు.
ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. మోడీ పాలనలో దేశ ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదన్నారు. ప్రశ్నించిన గొంతులపై ఈడీ, సీబీఐ పేరిట అణిచివేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని రాహుల్ గాంధీ న్యాయ యాత్రపై బీజేపీ నేతలు బురద జల్లే ప్రయత్నంచేయడం విచిత్రంగా ఉన్నదన్నారు. దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు.